బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గోవా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) సెక్రటరీ గిరిశ్ చోదాంకర్ డిమాండ్ చేశారు.
పనాజీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గోవా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) సెక్రటరీ గిరిశ్ చోదాంకర్ డిమాండ్ చేశారు. గోవా ప్రజలు బీజేపీయేతర ప్రభుత్వం కోసం ఓట్లు వేశారని, కానీ, అభిప్రాయాన్ని గౌరవించకుండా వేరే మార్గంలో మెజార్టీ ప్రజల నిర్ణయాన్ని పక్కకు పెట్టి బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ఇది ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా చేసిన చర్య అని ఈ నేపథ్యంలో అమిత్ షా గోవా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
బలవంతంగా అమిత్ షా గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఆరోపించారు. బీజేపీని ప్రజలు తిరస్కరించారని, కానీ మరోమార్గంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ఏప్రిల్ 9న గోవాలో ఓ భారీ బహిరంగా సభను రాష్ట్ర బీజేపీ ఏర్పాటుచేస్తుంది. ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి కృషి చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను ఈ సభలో సన్మానించనున్నారు.