న్యూఢిల్లీ: రాబోయే రైల్వే బడ్జెట్‌ను పౌర ఆధారితంగా తయారు చేసేందుకు సలహాలివ్వాల్సిందిగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రజలను కోరారు. పౌరులకు రైల్వేను మరింత చేరువ చేసేందుకు, ప్రజల ఇబ్బందులను మరింతగా అర్థం చేసుకునేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. రైళ్ల పొడిగింపు, కొత్త రైళ్ల ఏర్పాటు, కంప్యూటరీకరణ, నేరాల అదుపు, ఆహార సరఫరా, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు తదితర అంశాలన్నింటిపైనా సలహాలు, సూచనలు అందివ్వవచ్చని రైల్వే శాఖ తెలిపింది. ప్రజలు తమ సూచనలను ఈ నెల 16లోపు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో సమర్పించాలని రైల్వే శాఖ కోరింది. రైల్వే బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి వారంలో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.
రైల్వే బడ్జెట్‌పై సలహాలు కోరిన మంత్రి
Published Sat, Jan 10 2015 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM
Advertisement