కేంద్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ తొలిసారి తన స్వీయ నియంత్రణను కోల్పోయారు. తాను మాట్లాడుతుండగా మధ్యలో కలగజేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
లక్నో: కేంద్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ తొలిసారి తన స్వీయ నియంత్రణను కోల్పోయారు. తాను మాట్లాడుతుండగా మధ్యలో కలగజేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మాట్లేడేసమయంలో నిశ్శబ్దంగా ఉండకుంటే అందరికీ చెంపదెబ్బలుపడతాయని అన్నారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన మౌ వద్ద నియోన్ ఫెర్టిలైజర్కు సంబంధించి మాట్లాడుతున్న సమయంలో అక్కడికి చేరిన పెద్ద సమూహం పెద్దగా కేకలు పెడుతుండగా ఆయన తొలుత వారిని వారించే ప్రయత్నం చేశారు.
అయితే, వారు వినకుండా అలాగే తమ గోలను కొనసాగించడంతో ఆవేశానికి లోనైన ఆయన 'నిశ్శబ్దంగా ఉండండి. లేదంటే మీ చెంపలు పగులుతాయ్' అని అన్నారు. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సహాయం చేసేందుకైనా తాము సిద్ధమని అన్నారు. మథురలో ఘర్షణకు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. వేల ఎకరాల్లో ప్రభుత్వ భూమి గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేస్తున్నా ప్రభుత్వం వద్ద వివరాల్లేకుండా పోయాయని అని విమర్శించారు.