తెలంగాణ బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు: కేసీఆర్
తెలంగాణ బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు: కేసీఆర్
Published Thu, Feb 6 2014 5:44 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
నూఢిల్లీ: పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయే తెలంగాణ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఉంటుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ తెలిపారని టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణకు మద్దతు తెలుపుతున్న రాజ్ నాథ్ కు నాలుగున్నర కోట్ల ప్రజల తరఫున ధన్యవాదాలు అని కేసీఆర్ అన్నారు. సీమాంధ్ర ఎంపీలు రాష్ట్రాన్ని ఎందుకు విభజించవద్దో తెలుపవచ్చు, నిరసన తెలియ చేయవచ్చు అని కేసీఆర్ సూచించారు.
అయితే నిరసనకు ఓ పద్దతి ఉంటుంది అని కేసీఆర్ అన్నారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగలేని స్థితి ఏర్పడితే బాధ్యతగల వారంతా అవసరమైన చర్యలు తీసుకోని తెలంగాణ బిల్లుకు ఆమోదించాలని ఆయన సూచించారు. పార్లమెంట్ లో ప్రవేశపెట్టే తెలంగాణ బిల్లుకు మద్దతు కోరుతూ జాతీయ పార్టీల నేతలను కలుస్తున్న కేసీఆర్.. గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
Advertisement
Advertisement