పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ : పార్టీ లోక్‌సభ ఎంపీలందరూ నేడు, రేపు విధిగా సభలో ఉండాలని మూడు వాక్యాలతో కూడిన విప్‌ను బీజేపీ గురువారం జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని తిరిగి ప్రవేశపెట్టనుండటంతో సభ్యులకు విప్ జారీ చేసింది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును సభ ముందుంచేందుకు కేంద్ర క్యాబినెట్ బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
అంతకుమందు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నతస్ధాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ బిల్లుకు మద్దతివ్వాలని విపక్షాలను ప్రభుత్వం కోరింది. పార్లమెంట్లో అవాంతరాలతో కీలక సభా సమయం వృధా అవుతోందని ప్రధాని ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ప్రతిబింబించేలా పార్లమెంట్ ఉభయసభలూ సాగాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment