న్యూఢిల్లీ: రైల్వేలలో అభివృద్ధి కోసం గతేడాది డిసెంబర్లో జపాన్, రష్యాలతో కుదుర్చుకున్న సహకార ఒప్పందాలు బుధవారం కేంద్ర కేబి నెట్ ముందుకు వచ్చాయి. ప్రధాని మోదీ అ ధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జపాన్ తో కుదిరిన ఒప్పందం ద్వారా భారతీయ రైల్వేల్లో సిగ్నలింగ్ మెరుగుదల, పర్యావరణ అనుకూల రైల్వేస్టేషన్ల నిర్మాణాల్లో జరుగ నున్న అభివృద్ధి గురించి, రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందంతో హైస్పీడ్ రైళ్లు, లైన్ల ఆధునికీకరణలపై చర్చించారు. 2020లో అంతర్జాతీయ జియోలాజికల్ సెన్సైస్ కాంగ్రెస్‌ను భారత్‌లో జరపడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
విమానటికెట్లపై లెవీ వెనక్కు?: విమాన టికెట్లపై 2శాతం లెవీని పెంచాలనే నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కుతగ్గే సూచనలు కనబడుతున్నాయి. పెంపు నిర్ణయం అంతర్జాతీ య నిబంధనలకు విరుద్ధమంటూ విమర్శలు వస్తుండటంతో.. లెవీని వెనక్కు తీసుకోవాలనే ఆలోచనలో సర్కారున్నట్లు తెలుస్తోంది.
రైల్వేలో విదేశీ పెట్టుబడులపై కేబినెట్ చర్చ
Published Thu, Mar 3 2016 2:17 AM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM
Advertisement