న్యూఢిల్లీ: బిగ్‌బ్యాంగ్, హిగ్స్ బోసన్ వంటి విశ్వరహస్యాలను శాస్త్రవేత్తలు భారతీయ విద్యార్థులకు వివరిస్తున్నారు. ఇందుకు లైఫ్ ల్యాబ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నొయిడాకు చెందిన శివ్ నాడర్ స్కూల్... స్విట్జర్లాండ్– జెనివాలోని ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రిసెర్చ్ (సెర్న్) సంస్థతో కలసి పని చేస్తోంది. ‘హై ఎనర్జీ ఫిజిక్స్’లో చేసిన పరిశోధనలకుగాను అర్చనకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ‘విశ్వ రహస్యాలు’అనే అంశంపై 2 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం సమావేశాలు ప్రారంభమయ్యాయి.
సెర్న్ శాస్త్రవేత్త అర్చనాశర్మ మాట్లాడుతూ.. సీఈఆర్‌ఎన్‌లో భారత్ అసోసియేట్ మెంబర్ కావడం వల్ల ఇక్కడ నేర్చుకోవడానికి విద్యార్థులకు ఎన్నో అవకాశాలున్నాయన్నారు. సమావేశాల్లో మరో ప్రధానాంశం సీనియర్ శాస్త్రవేత్త, హిగ్స్ కన్వీనర్ డాక్టర్ అల్బెర్ట్ డీ రాక్‌తో విద్యార్థుల ఇంటరాక్టివ్ సేషన్. విశ్వం, ఫిజిక్స్ గురించి మరింత స్పష్టంగా అర్థం చేసుకునేందుకు ఈ కార్యక్రమాలు సాయపడతాయని శివ్ నాడర్ స్కూల్‌లో 12వ గ్రేడ్ విద్యార్థి ఆర్యాన్ శంకర్‌మిశ్రా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment