షాంగై: ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనను ఇరుదేశాల మధ్య సంబంధాల కోసం కాదని దీనికి చైనా అధికారికంగానే నిరసన తెలిపినట్టు ఆ దేశం శుక్రవారం ప్రకటించింది. మనదేశానికి చైనాతో అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు సమస్యలున్నాయి. వారు ఆ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్ గా పిలుస్తారు. అక్కడి తవాంగ్ ప్రాంతం టిబెట్ బుద్ధిజానికి ముఖ్యప్రదేశం. చైనా ఆ ప్రాంతాన్ని 1962 యుద్దం సందర్భంగా ఆక్రమించిన విషయం తెలిసిందే.
భారత్, చైనాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు మోదీ ఈ పర్యటనకు రావడం లేదని చైనా పేర్కొంటుంది. ప్రధాని మోదీ శుక్రవారం అరుణాచల్ ప్రదేశ్ లో ఓ రైల్వే లైన్, పవర్ స్టేషన్ లను ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో మౌలికవసతుల కల్పనకు, అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తామని చెప్పారు.
'గత 28 ఏళ్లలో ఎప్పుడు జరగని అభివృద్ధి కార్యక్రమాలను కేవలం ఈ ఐదేళ్లలో చేసి చూపిస్తాం' అని ఈ సందర్భంగా మోదీ అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు ఆ ప్రాంత అభివృద్దికి దోహదం చేస్తాయన్నారు.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గత జనవరిలో భారత్ పర్యటనతో ప్రధాని మోదీతో సన్నిహిత సంబంధాలు మెరుగైనట్టు కనిపిస్తున్నాయి. ఒబామా పర్యటన చైనాపై చాలా ప్రభావం చూపించింది. దీంతో చైనా నౌకా దళాలు హిందూ మహాసముద్రంపై తమ ఆధిక్యం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు కనపిస్తోంది.
మోదీ పర్యటనకు చైనా నిరసన
Published Sat, Feb 21 2015 1:45 PM | Last Updated on Fri, Aug 24 2018 1:48 PM
Advertisement
Advertisement