సాక్షి, ముంబై: ఇటీవల ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో రాజకీయ నాయకుల్లో ఆనందాన్ని నింపినప్పటికీ విద్యార్థులను మాత్రం గందరగోళానికి గురిచేస్తోంది. అక్టోబరులో వివిధ పాఠశాలల్లో జరగనున్న బోర్డు పరీక్షలు, ముంబై యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కళాశాలు కాలేజీలు, ఇతర పాఠశాలల్లో ఆరు నెలల (ఫస్ట్ సెమిస్టర్) పరీక్షలు జరగనున్నాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో విద్యార్థుల పరీక్షల టైం టేబుల్ పూర్తిగా అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఏర్పడింది.
ఎన్నికల పనుల్లో టీచర్లు
ఎన్నికలు అక్టోబరు 15న ఆ తరువాత నాలుగు రోజలకు లెక్కింపు ఉంటుంది. ఎన్నికలకు రెండు రోజుల ముందు, లెక్కింపు పూర్తయిన తరువాత ఇతర పనులకు మరో రెండు రోజులు ఇలా దాదాపు వారం రోజులపాటు ఉపాధ్యాయులు ఎన్నికల పనుల్లోనే ఉండాల్సి వస్తోంది. ఓటింగ్ రోజు మొదలుకుని లెక్కింపు పూర్తయ్యే వరకు పాఠశాలలు ఎన్నికల అధికారుల ఆధీనంలోనే ఉంటాయి.
శిక్షణ కోసమని..
ఎన్నికల పనులు ఉపాధ్యాయులతోపాటు బోధనేతర సిబ్బంది కూడా వెళ్తాతారు. మధ్యమధ్యలో ఎన్నికల పనులపై శిక్షణ కోసం కూడా వెళుతుంటారు. టైం టేబుల్ ప్రకారం టీచర్లు విద్యాబోధన చేయడానికి విలువైన సమయాన్ని కోల్పోతారు. ఎన్నికలకు కేవలం నెల రోజుల గడువు మాత్రమే ఉంది. ఆ లోపు విద్యార్థుల సిలబస్ ఎలా పూర్తిచేయాలో టీచర్లు ఆందోళనలో పడిపోయారు.
మినహాయింపు కుదరదు
ఎన్నికల సమయంలోనే ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహంచే అవకాశాలున్నాయి. ఇందుకోసం ఎన్నికల పనుల నుంచి ఉపాధ్యాయులకు పూర్తిగా మినహాయింపు నివ్వాలని ఇదివరకే మహారాష్ట్ర స్టేట్ సెకండరీ, హయ్యర్ సెకండరీ విద్యా బోర్డు ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసినట్లు మహారాష్ట్ర రాష్ట్ర శిక్షక్ పరిషద్‌కు చెందిన అనీల్‌బోర్నారే చెప్పారు. నియమాల ప్రకారం ఎన్నికల పనులకు వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించక తప్పడం లేదని ఎన్నికల కమిషన్ చెబుతోంది. దీని ప్రభావం విద్యార్థుల భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
చదువులకు ఆటంకం
Published Tue, Sep 16 2014 10:27 PM | Last Updated on Tue, Aug 14 2018 5:15 PM
Advertisement
Advertisement