గువాహటిలో కొవ్వొత్తులను ప్రదర్శిస్తున్న యువతులు
సాక్షి, న్యూఢిల్లీ: దిశ ఘటనకు నిరసనగా ఢిల్లీలో ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కఠిన చట్టం చేయాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా కేసులను త్వరితగతిన విచారించి దోషులను ఉరి తీయాలన్న డిమాండ్‌తో ప్రజా సంఘా లు, విద్యార్థి సంఘాలు, యువతులు మంగళవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఉద్యమించారు. హత్యాచారాలకు పాల్పడే దోషులను ఆరు నెలల్లో ఉరి తీయాలన్న డిమాండ్‌తో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ నిరాహార దీక్షకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. అత్యాచారాల కేసుల్లో దోషులను ఆరు నెలల్లో ఉరి తీయాలని ఆమె ప్రధాని మోదీకి లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment