
జైపూర్: ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చిన కాంగ్రెస్ యువ నాయకుడు, ఉపముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ కార్యాలయాన్ని అధికారులు సోమవారం ఉదయం మూసివేశారు. జైపూర్‌లోని ఆయన కార్యాలయంలో పనిచేసే ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలడమే ఇందుకు కారణం. సచిన్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ కార్యాయలం హెడ్ క్వార్టర్స్ జులై 13 వరకు, గ్రామీణాభివృద్ధి శాఖ హెడ్ క్వార్టర్స్ జులై 14 వరకు మూసి ఉంటాయని అధికారులు తెలిపారు.
(చదవండి: బీజేపీకి సచిన్ పైలట్ షాక్)
కాగా, రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య సోమవారం నాటికి 24,392 కు చేరింది. 510 మంది కరోనాకు బలయ్యారు. ఇక మహమ్మారి కరోనాతో పోరాటం చేస్తున్న సీఎం అశోక్ గహ్లోత్ ప్రభుత్వానికి సచిన్ పైలట్ తిరుగుబాటు రూపంలో ముప్పు తప్పేలా లేదు. 30 మంది ఎమ్మెల్యేలు తన వెంట ఉన్నారని,కొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా తనకు మద్దతిస్తున్నారని సచిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అశోక్ గహ్లోత్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు. సచిన్ వాట్సాప్ గ్రూప్ నుంచి ఆదివారం ఈ ప్రకటన వెలువడింది.
(‘109 మంది ఎమ్మెల్యేలు మా వెంటే’)
Comments
Please login to add a commentAdd a comment