దేశంలో కొత్తగా 4,213 కేసులు | COVID-19 cases in India rise to 67152 lifeless toll 4213 | Sakshi
Sakshi News home page

దేశంలో కొత్తగా 4,213 కేసులు

May 12 2020 3:26 AM | Updated on May 12 2020 3:26 AM

COVID-19 cases in India rise to 67152 lifeless toll 4213 - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్‌–19 కేసులు 24 గంటల్లో అత్యధికంగా నమోదై రికార్డు సృష్టించాయి. కొత్తగా 4,213 కేసులు వెలుగులోకి రావడంతో మొత్తం కేసుల సంఖ్య 67,152కు చేరుకుంది. అదేవిధంగా,  కోవిడ్‌తో మరో 97 మంది మృతి చెందడంతో చనిపోయిన వారి సంఖ్య 2,206కు ఎగబాకింది. దీంతోపాటు, 24 గంటల్లో అత్యధికంగా 1,559 మంది బాధితులు కోలుకుని, ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కావడంతో ఈ మహమ్మారి కోరల నుంచి బయటపడిన వారి సంఖ్య 20,917కు చేరుకుని, రికవరీ రేటు 31.15 శాతంగా ఉందని కేంద్రం తెలిపింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు చనిపోయిన 97 మందిలో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 53 మంది ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్, పశ్చిమబెంగాల్, తమిళనాడు ఉన్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement