సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర ప్రభుత్వం మధ్య యుద్ధం రోజుకో మలుపు తీసుకుంటోంది. ఢిల్లీ పాలనపై రాష్ట్రానికి పూర్తి అధికారాలు ఉండాలంటూ అరవింద్ కేజ్రీవాల్ చాలాకాలంగా న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రస్తుతంఈ కేసు సుప్రీం కోర్టు పరిధిలో ఉంది.
దేశ రాజధానిగా ఢిల్లీని పేర్కొంటూ.. రాజ్యాంగంలోకానీ, లేదా పార్లమెంట్ కానీ ఎక్కడా చట్టం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీం కోర్టుకు తెలిపింది. రాజ్యాంగంలోకానీ, లేదా ఏదైనా చట్టం ద్వారా కానీ దేశరాజధానిగా ఢిల్లీని పేర్కొన్నారా? అంటూ కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో తమ వాదన వినిపించింది.
ఢిల్లీ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టుల వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ఈ మేరకు సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోకానీ, చట్టం ద్వారా కానీ ఢిల్లీని దేశ రాజధానిగా ప్రకటించలేదని.. ఈ నేపథ్యంలో రాజధానికి ఇక్కడనుంచి మరోచోటకు తరలించి ఢిల్లీ ప్రభుత్వానకి కార్యనిర్వహణాధికారాలు దఖలు పర్చవచ్చని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment