నిద్రపోతున్న సింహాన్ని రెచ్చగొట్టద్దు
'నిద్ర పోతున్న సింహాన్ని అనవసరంగా రెచ్చగొట్టద్దు' అంటూ కేంద్ర ప్రభుత్వానికి ఎండీఎంకే నాయకుడు వైగో తీవ్ర హెచ్చరికలు పంపారు. ప్రభుత్వ సోషల్ మీడియా ఖాతాలలో హిందీని తప్పనిసరిగా వాడాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై తమిళనాట బీజేపీ మిత్రపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. బీజేపీకి మిత్రపక్షాలుగా ఉన్న పీఎంకే, ఎండీఎంకే రెండూ కూడా.. బీజేపీ వైఖరిని తప్పుబట్టాయి. అందులో భాగంగానే ఎండీఎంకే నాయకుడు వైగో ఈ వ్యాఖ్యలు చేశారు. హిందీని రుద్దాలన్న నిర్ణయించడాన్ని తమిళనాడు ఎప్పటికీ ఆమోదించదని, గతంలో కూడా రక్తమోడ్చి తాము హిందీపై పోరాడామని, ఇప్పుడు మళ్లీ రెచ్చగొట్టద్దని ఆయన అన్నారు.
పీఎంకే నాయకుడు ఎస్ రాందాస్ కూడా హిందీ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. హిందీ అధికారభాష కాబట్టే దాన్ని అందరిపై రుద్దుతున్నారని, దీనికి పరిష్కారంగా దేశంలోని మొత్తం 22 భాషలనూ అధికార భాషలుగా ప్రకటించాలని ఆయన చెప్పారు.