
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా మూతబడిన ప్రైవేట్ పరిశ్రమలు తమ ఉద్యోగులను ఆరు నెలలపాటు అంటే మార్చి నుంచి ఆగస్టు వరకు తొలగించేందుకు వీలులేకుండా ప్రభుత్వం చట్టం తీసుకురావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) రంగంలోని సిబ్బంది వేతనంలో 70 శాతం ప్రభుత్వమే మార్చి నుంచి మే వరకు చెల్లించాలని కాంగ్రెస్ ప్రతినిధి గౌరవ్ వల్లభ్ కోరారు. 2019 లెక్కల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న 4.25 కోట్ల ఎంఎస్‌ఎంఈల్లో 45 కోట్ల మంది పనిచేస్తుండగా, ఈ రంగం రూ.61 లక్షల కోట్లు అంటే జీడీపీలో 29 శాతం మేర సమకూర్చుతోందని వివరించారు. (55 ఏళ్లు దాటిన పోలీసులకు కరోనా డ్యూటీ ‘నో’)
చదవండి: కరోనాకు 35,349 మంది బలి
Comments
Please login to add a commentAdd a comment