
మాస్కో : భారత్‌పై దౌత్య వివాదానికి ఉగ్రవాదాన్నే పాకిస్తాన్ ఆయుధంగా మలుచుకుంటోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. పాక్ విధానం విస్తుగొలుపుతుందని, ఉగ్రవాదాన్నే ప్రభుత్వ విధానంగా పొరుగు దేశం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. భారత ఉపఖండంలో వాణిజ్య పురోగతికి పాక్ అవరోధాలు కల్పిస్తోందని దుయ్యబట్టారు. రష్యా పర్యటనలో భాగంగా ఆయన మాస్కోలో మాట్లాడుతూ అంతర్జాతీయ సంబంధాల్లో ప్రపంచంలో ఏ దేశం వ్యవహరించని రీతిలో పొరుగు దేశం పట్ల ఉగ్రవాదాన్నే దౌత్య ఆయుధంగా చేపట్టడం పాకిస్తాన్‌కే చెల్లిందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు ముందు ఆ దేశంలో పర్యటిస్తున్న జైశంకర్ బుధవారం రష్యా విదేశాంగ మంత్రితో సమావేశమవుతారు. ప్రధాని మోదీ రష్యా పర్యటన ఏర్పాట్లు, ఇరు దేశాధినేతల మధ్య చర్చించాల్సిన అంశాలపై వారు సంప్రదింపులు జరుపుతారు.
Comments
Please login to add a commentAdd a comment