న్యూఢిల్లీ: దేశంలో ప్రతి 15 నిమిషాలకు ఓ చిన్నారిపై లైంగికదాడి జరుగుతోంది. పదేళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం మైనర్‌లపై నేరాల సంఖ్య 500 శాతానికి పైగా పెరిగింది. పిల్లలపై నేరాలకు సంబంధించి నమోదవుతున్న కేసులను విశ్లేషించిన క్రై (చైల్డ్ రైట్స్ అండ్ యు) అనే స్వచ్ఛంద సంస్థ ఈ విషయాలను వెల్లడించింది. అలాగే బాలలపై జరుగుతున్న నేరాల్లో 50 శాతానికి పైగా కేవలం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌లలోనే నమోదవుతన్నాయంది. పిల్లలపై నేరాల్లో పోక్సో (లైంగిక దాడుల నుంచి చిన్నారులకు రక్షణ) చట్టం కింద నమోదవుతున్న కేసులే దాదాపు 33 శాతం ఉన్నాయంది.
Comments
Please login to add a commentAdd a comment