డాక్యుమెంటరీ ఎందుకు బ్యాన్ చేశారు: నిర్బయ తండ్రి
'ఇండియా డాటర్' డాక్యుమెంటరీ ప్రదర్శన తప్పేం కాదని, ఎందుకు మన దేశంలో దానిపై నిషేధం విధించారని నిర్భయ తండ్రి ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. ఆ డాక్యుమెంటరీ ప్రతి ఒక్కరూ చూడాల్సినదని, భారతదేశంలో వ్యక్తుల ఆలోచన విధానానికి, సమాజానికి ఆ డాక్యుమెంటరీ అద్దం పట్టేదన్నారు. 2012లో తన కూతురుకు జరిగిన అన్యాయాన్ని బీబీసీ డాక్యుమెంటరీగా తీసిందని చెప్పారు.
'ప్రతి ఒక్కరు ఆ చిత్రాన్ని చూడాలి. జైలులో ఉన్న ఓ వ్యక్తి (ముఖేశ్ను ఉద్దేశించి) అలా మాట్లాడగలుగుతున్నాడంటే.. అతడిని స్వేచ్ఛగా వదిలేస్తే ఇంక ఏం మాట్లాడుతాడో ఊహించుకోండి' అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో ఏం జరుగుతుందనే విషయాన్నే ఆ డాక్యుమెంటరీ చూపించిందని, నేరస్తులపట్ల ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేం దానిని అంగీకరించడం తప్ప ఏమి చేయలేమని నిస్సహాయతను వ్యక్తం చేశారు. కాగా ఇండియా డాటర్ డాక్యుమెంటరీని బీబీసీ చానెల్కు చెందిన బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ లెస్లీ ఉడ్విన్ తీశారు. ఇందుకోసం వారు నిర్భయ తల్లిదండ్రులు, వైద్యులు, పోలీసులు, లాయర్లు, ఈ నేరానికి పాల్పడినవారిలో ఒకరిని ప్రశ్నించి దీనిని రూపొందించారు.