
సాక్షి, తిరువల్లూర్(తమిళనాడు): విద్యార్థినితో టాయిలెట్ కడిగించిన టీచర్ ఉదంతం తమిళనాట కలకలం రేపింది. తిరువళ్లూర్‌లోని ఆర్‌ఎం జైన్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో జరిగిన ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆరు నుంచి పదో తరగతి వరకు దాదాపు వెయ్యిమంది బాలికలు చదువుకుంటున్న ఈ పాఠశాలకు చెందిన విద్యార్థినిని టాయిలెట్ కడగాలంటూ టీచర్ అదేశించింది. ఆపై విద్యార్థిని టాయిలెట్ కడుగుతుండగా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది.
ఇందులో ఓ విద్యార్థిని చేతితో బట్ట ముక్కను పట్టుకుని తుడుస్తున్నట్లు, వెక్కి వెక్కి ఏడుస్తున్నట్లు ఉంది. పక్కనే ఉన్న మరో బాలికతో నీరు తీసుకురావాలని అడగ్గా ఆమె తీసుకువచ్చిన నీటితో టాయిలెట్ కడుగుతున‍్నట్లుగా ఉంది. దీనిపై సదరు టీచరు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారులు విచారణ చేపట్టి, సదరు బాలికలతో మాట్లాడారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని కూడా ప్రశ్నించారు. ఆ మేరకు నివేదికను ఉన్నతాధికారులకు పంపించామని డీఈవో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment