లండన్‌లో రమ్య | Film actress, mandya Former MP Ramya in landon | Sakshi
Sakshi News home page

లండన్‌లో రమ్య

Published Fri, Nov 7 2014 4:10 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM

లండన్‌లో రమ్య - Sakshi

లండన్‌లో రమ్య

* రాజకీయ శిక్షణ కోసం
* డిసెంబర్ మొదటి వారంలో తిరిగి రాక
* రమ్య తల్లి రంజితా వెల్లడి

మండ్య : రాజకీయ రంగంలో మరిన్ని మెళకువలను నేర్చుకోవడానికి సినీనటి, మండ్య మాజీ ఎంపీ రమ్య లండన్‌కు వెళ్లినట్లు ఆమె తల్లి రంజితా తెలిపారు. గురువారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. అక్కడ మూడు నెలల కోర్సు చేస్తోందని, డిసెంబర్ నెల మొదటి వారంలో తిరిగి మండ్యకు వస్తుందని చెప్పారు. రమ్య కర్ణాటకను వీడి ఎక్కడికీ వెళ్లలేదని స్పష్టం చేశారు. విదేశాలకు వెళ్లిన రమ్య ఇక తిరిగి రారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు.  

త్వరలోనే రమ్య కార్యకర్తలకు అందుబాటులోకి వస్తారని చెప్పారు. రమ్య ఎంపీగా ఉన్న సమయంలో మండ్య జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రజల కష్టాలు తెలుసుకున్నారని, అనేక అభివృద్ధి కార్యక్రమాలనూ చేపట్టారని వివరించారు. గత ఎన్నికల్లో ఓడినా రమ్య బాధపడలేదని, కార్యకర్తలపై ఆపార నమ్మకంతో మళ్లీ తిరిగి వస్తోందని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement