
మదన్‌లాల్ ఖురానా
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత మదన్‌లాల్ ఖురానా (82) అనారోగ్య కారణాలతో శనివారం రాత్రి 11 గంటలకు ఢిల్లీలోని తమ ఇంట్లో మరణించారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 1993–96 మధ్య కాలంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఖురానా, 2004లో రాజస్తాన్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆయనకు ఛాతీలో ఇన్‌ఫెక్షన్ ఉందనీ, శనివారం ఉదయం నుంచీ ఆరోగ్యం మరింత విషమించిందని ఖురానా కొడుకు హరీశ్ చెప్పారు. అంత్యక్రియలను ఆదివారం నిర్వహిస్తామన్నారు. ఖురానాకు భార్య, ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మరో కుమారుడు నెల క్రితమే మరణించారు.