సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర జల వనరుల శాఖమంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 22న పోలవరం ప్రాజెక్ట్‌ను స్వయంగా పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాణపు పనులను ఆయన పర్యవేక్షించనున్నారు. అదే రోజు ప్రాజెక్ట్ పనులపై సమీక్ష జరపనున్నట్లు గడ్కరీ తెలిపారు. 2018కల్లా ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు. పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి బిల్లులు తమ వద్ద పెండింగ్‌లో లేవని, వాటిని ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయాలని ఆదేశించినట్లు గడ్కరీ తెలిపారు.
ఏపీ సర్కార్‌కు కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనులు పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. కాగా గడ్కరీ ఈ ఏడాది అక్టోబర్ లో పోలవరంను సందర్శించారు. అయితే టెండర్ల విషయంలో పోలవరం ప్రాజెక్టు పై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గడ్కరీ స్వయంగా పోలవరంను సందర్శించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. జల వనరుల శాఖ కార్యదర్శి ఉపేంద్రసింగ్ కూడా గడ్కరీతో కలిసి పోలవరానికి వెళ్లనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment