సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 లాక్‌డౌన్‌లతో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను మే 7 నుంచి దేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వీరందరినీ దశలవారీగా విమానాలు, నౌకల ద్వారా స్వదేశానికి రప్పిస్తామని ప్రభుత్వం పేర్కొంది. దీనికోసం నిర్థిష్ట విధివిధానాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆయా దేశాల భారత రాయబార కార్యాలయాలు దేశానికి తిరిగివచ్చే భారత పౌరుల జాబితాలను సిద్ధం చేస్తాయి. స్వదేశానికి వచ్చేందుకు అయ్యే చార్జీలను ప్రయాణీకులే భరించాల్సి ఉంటుంది.
ఇక కరోనా లక్షణాలు లేని వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారని హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ వెల్లడించింది. ఇక స్వదేశానికి తిరిగివచ్చిన తర్వాత ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ప్రయాణీకులు పాటించాల్సి ఉంటుంది. భారత్‌కు చేరుకున్న తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి రెండు వారాలు క్వారంటైన్‌లో ఉంచిన అనంతరం మార్గదర్శకాలకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపడతారు.
Comments
Please login to add a commentAdd a comment