పట్నా: పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో ఆర్జేడీ మాజీ ఎంపీ, డాన్ మొహమ్మద్ షాబుద్దీన్ బెయిల్ రద్దు కోరుతూ నితీశ్ కుమార్ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇటీవలే షాబుద్దీన్కు పట్నా హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 2004 సంవత్సరంలో ఇద్దరు సోదరులను హత్య చేసిన కేసులో షాబుద్దీన్ 11 ఏళ్ల జైలు శిక్ష అనంతరం ఆయన గత వారమే బెయిలుపై విడుదల అయ్యారు.
కాగా ఇంటా, బయటా విమర్శలు రావటంతో షాబుద్దీన్ బెయిల్ రద్దు చేయాలంటూ నితీశ్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ సోమవారం విచారణ జరగనుంది. మరోవైపు బాధితుల తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా షాబుద్దీన్ బెయిల్ను సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
కాగా నితీష్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రి అయినా తన నాయకుడు మాత్రం లాలు ప్రసాద్ యాదవేనని, ఆయనకు మాత్రమే తాను విధేయుడినని షాబుద్దీన్ అన్నాడు. తాను మళ్లీ జైలుకు వెళ్లేందుకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.
‘షాబుద్దీన్ బెయిల్ రద్దు చేయండి’
Published Fri, Sep 16 2016 3:32 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement