అమేథినే చక్కదిద్దలేని రాహుల్ దేశాన్ని పాలిస్తారా?
సర్గూజా(చత్తీస్ ఘర్): అమేథి నియోజకవర్గాన్ని చక్కదిద్దాడానికే చేతకాని రాహుల్ గాంధీ దేశాన్ని ఏం బాగుచేస్తాడని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ప్రశ్నించారు. చత్తీస్ ఘర్ లో జరిగిన సభలో సోనియా, రాహుల్ గాంధీ లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పాలన సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా ఆస్తులు గణనీయంగా పెరగడంపై మోడీ నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ విధానాలకు మద్దతిచ్చి.. రాహుల్ గెలిపించాలని సోనియా అమేథి ప్రజలను అభ్యర్థించడాన్ని మోడీ ఎద్దేవా చేశారు.
దేశ ప్రజల ఆకాంక్షలను గాంధీ కుటుంబం తుంగలో తొక్కుతున్నారని ఆయన ఆరోపించారు. రాహుల్ అమేథి ప్రజలు అక్కున చేర్చుకోండి.. దేశ అభివృద్దిని తాము చూసుకుంటామని చెప్పిన సోనియా వ్యాఖ్యల్లో ఏమైనా అర్ధం ఉందా అని మోడీ చురకలంటించారు.