రోజుకో చట్టాన్ని రద్దు చేస్తా: ప్రధాని మోదీ | i wish was to erase one law a day in his five-year term says PM modi | Sakshi
Sakshi News home page

రోజుకో చట్టాన్ని రద్దు చేస్తా: ప్రధాని మోదీ

Published Sun, Apr 5 2015 5:27 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

న్యాయవిధానాలపై జాతీయ సదస్సులో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ - Sakshi

న్యాయవిధానాలపై జాతీయ సదస్సులో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

ప్రతస్తుతం కొనసాగుతున్న న్యాయవ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి, సమస్యల పరిష్కారం కోసం బలమైన యంత్రాంగాన్ని రూపొందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

ప్రతస్తుతం కొనసాగుతున్న న్యాయవ్యవస్థను  పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి, సమస్యల పరిష్కారం కోసం బలమైన యంత్రాంగాన్ని రూపొందించాలని  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తప్పులు చేసినప్పటికీ చట్టంలోని ఏదోఒక పరిష్కారంతో బయటపడే అవకాశం ఉంటుందని, అలా ఒకదానివెంట మరొక తప్పు చేసుకుంటూ వెళ్లడం ఎంతవరకు సమంజసమో సమీక్షించుకోవాలని పిలుపునిచ్చారు. న్యాయపరిపాలనా విధానాలపై ఆదివారం ఢిల్లీలో ప్రారంభమైన మూడురోజుల జాతీయ సదస్సులో ఆయన ఉపన్యసించారు. వివిధ రాష్ట్రాల  ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తులు ఈ సదస్సుకు హాజరయ్యారు.  

ప్రస్తుత సమాజానికి పనికిరాని 700 చట్టాలను తొలిగించాలని, 1700 చట్టాల్లో సంవరణలు అవసరని, ఈ మేరకు సంస్కరణలు చేయాలని తమ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని చెప్పారు.  'నేను ప్రధానిగా కొనసాగే ఐదేళ్ల కాలంలో రోజుకో పనికిరాని చట్టాన్ని రద్దుచేయాలనుకుంటున్నా' అని ప్రధాని మోదీ అన్నారు.

ట్రిబ్యూనళ్ల పనితీరుపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ 'ట్రిబ్యూనళ్లు సమస్యలను సతర్వరం పరిష్కరించడానికి ఏర్పాటుచేశారా లేక సాగతీతకోసం ఏర్పాటుచేశారా అనే అనుమానం కలుగుతోందన్నారు. ట్రిబ్యూనళ్ల సంఖ్య ఇప్పటికే 100కు చేరిందని, వాటి నిర్వాహణకు అయ్యే ఖర్చుతో ఎన్నెన్నో కోర్టు భవనాలను కట్టవచ్చని, తద్వారా సత్వర న్యాయాన్ని ప్రజలకు చేరవేయవచ్చని అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement