కోల్‌కతా : కరోనా పరీక్షల కోసం మమతా బెనర్జీ ప్రభుత్వం తగినన్నిసాంపిల్స్ పంపడం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్ ) ఆరోపించింది. గత వారంలో రోజుకు 20 సాంపిల్స్ కూడా రాలేవని, అయితే ఎక్కువ జనసాంద్రత ఉన్న రాష్ర్టంలో అందుకు తగినన్ని పరీక్షలు జరగడం లేదని ఐసిఎంఆర్-ఎన్ఐసీడీ డైరెక్టర్ డాక్టర్ శాంత దత్తా పేర్కొన్నారు. ప్రారంభంలో రాష్ర్టంలో కరోనా పరీక్షలు చేస్తున్న ఏకైక కేంద్రం కావడంతో ఒక రోజులో 90-100 నమూనాలు వచ్చాయని, ఇప్పడు ఇతర కేంద్రాలు ఉండటంతో ఎన్ఐసీఈడీకి పంపే నమూనాల సంఖ్య తక్కువగా ఉందని పేర్కొన్నారు. కానీ వాటితో పోలిస్తే ఇక్కడ సదుపాయాలు ఎక్కువని తెలిపింది. టెస్టింగ్ కిట్ల కొరత ఉందన్న మమతా ఆరోపణల్ని ఆయన తోసిపుచ్చారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఇదిరకే 7,500 టెస్టింగ్ కిట్లను పంపిణీ చేశామని, ప్రస్తుతం 27,000 కిట్లు స్టాక్ ఉన్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment