
సాక్షి, ముంబై : రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఐఐటీ ముంబై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం మొత్తం ముఖాముఖి క్లాసులను రద్దు చేసింది. ఇకపై ఆన్‌లైన్ ద్వారానే క్లాసులు నిర్వహించాలని నిశ్చయించుకుంది. విద్యార్థుల ఆరోగ్యమే అత్యంత ముఖ్యమని భావించిన ఐఐటీ ముంబై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ ద్వారా క్లాసులు వినేందుకు పేద విద్యార్థులకు అవసరమైన ఆర్థిక సహాయం చేయాలని దాతలను కోరింది. వారు ఆన్‌లైన్ చదువులు కొనసాగించటానికి అవసరమైన ల్యాప్‌టాప్స్, ఇంటర్‌నెట్ కనెక్షన్‌లు, ఇతర సౌకర్యాలు కల్పించడానికి దాదాపు ఐదు కోట్ల రూపాయలు అవసరమవుతాయని దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని విన్నవించింది.
చదవండి : 24గంటల్లో.. 16, 922 కరోనా కేసులు