పాక్‌పై భారత్–యూఏఈ పరోక్ష వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మతాన్ని అడ్డం పెట్టుకుని ఇతర దేశాలకు ముప్పు తెచ్చేలా ఉగ్రవాదానికి తోడ్పాటునందించడం తగదని పాకిస్తాన్ ను ద్దేశించి భారత్, యూఏఈ పరోక్షంగా వ్యాఖ్యానించాయి. ఉగ్రవాదాన్ని అంత మొందించేలా ప్రత్యేక విధానాన్ని తెచ్చేం దుకు సహకరించుకోవాలని ఓ అంగీకారా నికి వచ్చాయి. ఇరు దేశాల్లో శాంతిభద్రత లకు ఉగ్రవాదంతో ముప్పు పొంచి ఉందని, ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించరాదని, వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టాలని నిర్ణయించినట్టు భారత్– యూఏఈ ఓ ప్రకటనలో పేర్కొ న్నాయి. బుధవారం జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఈ అంశంపై ప్రధాని మోదీ, అబుదాబి యువరాజు షేక్ మొహ మ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సుదీర్ఘంగా చర్చించారు. ఉగ్రవాదానికి స్వర్గధామా లుగా ఉన్న ప్రాంతాలను నియంత్రించేం దుకు చర్యలు తీసుకోవాలన్నారు.
యూఏఈకి ధన్యవాదాలు: ప్రణబ్
యూఏఈ లక్షలాది మంది భారతీయులను అక్కున చేర్చుకుందని, వారు అభివృద్ధి పథంలో పయనించేందుకు తోడ్పాటు అందించిందని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చెప్పారు. ఈ విషయంలో ఆ దేశానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు.
మతం పేరుతో ఉగ్రవాదానికి ప్రోత్సాహం తగదు
Published Fri, Jan 27 2017 2:22 AM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM
Advertisement
Advertisement