
ఇంద్రాణి ముఖర్జియా (ఫైల్ ఫోటో)
ముంబై : ఒక వేళ నేను మరణిస్తే.. నా మరణానికి సీబీఐ బాధ్యత వహిస్తుందా అంటూ ప్రశ్నించారు ఇంద్రాణి ముఖర్జియా. ప్రస్తుతం ఇంద్రాణి, కన్నకూతురు షీనా బోరాను హత్య చేసిన ఆరోపణలతో జైలు జీవితాన్ని గడుపుతున్న సంగతి తెలిసిందే. అనారోగ్యంగో బాధపడుతున్న తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆమె సీబీఐ కోర్టుకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ బెయిల్ పిటిన్‌ను ఈ రోజు కోర్టు విచారించింది.
ఈ సందర్భంగా ఆమె వాదిస్తూ, 'అనారోగ్యంతో ఉన్న నాకు బెయిల్ చాలా అవసరం. నేను మెదడులో నరాల సమస్యతో బాధపడుతున్నాను. బెయిల్ వచ్చిన వెంటనే స్పెషలిస్టుల చేత వైద్యం చేయించుకుంటాను. ఒక వేళ నేను చనిపోతే దానికి సీబీఐ బాధ్యత తీసుకుంటుందా?' అని ప్రశ్నించింది. అయితే కోర్టు ఆమె వాదనలను పట్టించుకోలేదు. ఇంద్రాణికి బెయిల్ మంజూరు చేయలేమంటూ ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. ఇంద్రాణి ముఖర్జియా ప్రస్తుతం ముంబైలోని భైకుల్లా జైల్లో శిక్షను అనుభవిస్తోంది. కూతరు శినా బోరాను హత్య చేసిని కేసులో 2015లో ఆమెను అరెస్ట్ చేశారు. గతంలో కూడా ఆమె బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఆమె మంచి చెడ్డలు చూడటానికి కుటుంబసభ్యులు ఎవరూ లేరని కోర్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment