30 లక్షల ఐటీ ఉద్యోగాలు!
న్యూఢిల్లీ: దేశీ ఐటీ రంగంలో మందగమనంలాంటిదేమీ లేదని 2025 నాటికల్లా పరిశ్రమలో 25–30 లక్షల దాకా ఉద్యోగాల కల్పన జరగగలదని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. గడిచిన మూడేళ్లలో దేశీ ఐటీ కంపెనీలు 6 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించాయని ఆయన వివరించారు.
గత మూడేళ్లలో ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ పనితీరు గురించి వివరిస్తూ మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఐటీ కంపెనీలు 40 లక్షల మందికి ప్రత్యక్షంగా, 1.3 కోట్ల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నాయన్నారు. ఐటీ పరిశ్రమ గణనీయంగా ఎదుగుతోందని, రాబోయే నాలుగైదేళ్లలో కొత్తగా 20–25 లక్షల ఉద్యోగాల కల్పన జరగలదని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ అంచనా వేసినట్లు ప్రసాద్ చెప్పారు.