
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అత్యంత చౌకైన, మట్టిలో కలసిపోయే శానిటరీ న్యాప్‌కిన్లను కేంద్రం గురువారం ఆవిష్కరించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధానమంత్రి భారతీయ జనఔషధి పరియోజన(పీఎంబీజేపీ) కేంద్రాల్లో నాలుగు న్యాప్‌కిన్లు ఉండే ఒక్కో ప్యాక్‌ను ‘సువిధా’ పేరుతో కేవలం రూ.10కే అందించనున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి అనంత్‌కుమార్ తెలిపారు. ఈ ఏడాది మే 28 నాటికల్లా దేశంలోని 3,200 పీఎంబీజేపీ కేంద్రాల్లో వీటిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment