
శాసనసభాపక్షనేతగా జయలలిత ఎన్నిక
అన్నాడీఎంకే శాసనసభా పక్షనేతగా జయలలిత మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం అన్నాడీఎంకే శసనసభా పక్ష సమావేశం జరిగింది.
చెన్నై: అన్నాడీఎంకే శాసనసభా పక్షనేతగా జయలలిత మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం అన్నాడీఎంకే శసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు మళ్లీ తమ నేతగా జయలలితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జయలలితఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు తమిళనాడు గవర్నర్ రోశయ్యను కలవనున్నారు. శనివారం ఆమె తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మరోవైపు ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఈరోజు సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు.