భూకంపంతో ధ్వంసమైన నేపాల్ రాజధాని కఠ్మాండ్ నుంచి భారత్లోని ఉత్తరప్రదేశ్ వరకు రహదారులను సైన్యం మంగళవారం పునరుద్ధరించారు.
నేపాల్: భూకంపంతో ధ్వంసమైన నేపాల్ రాజధాని కఠ్మాండ్ నుంచి భారత్లోని ఉత్తరప్రదేశ్ వరకు రహదారులను సైన్యం మంగళవారం పునరుద్ధరించారు. దీంతో ఉత్తరప్రదేశ్ నుంచి 18 ట్రక్కుల్లో ఆహార సామాగ్రి, దుప్పట్లు ఖాట్మాండ్ చేరుకున్నాయి. అలాగే ఖాట్మాండ్ నుంచి 1200 మంది భారతీయులను బస్సులో స్వదేశానికి తరలిస్తున్నారు. అందుకోసం ఇప్పటికే గోరఖ్పూర్ నుంచి 100 బస్సులు కఠ్మాండ్కు చేరుకున్నాయి.
వీలైనంత మంది భారతీయులను బస్సులలో గోరఖ్పూర్ పంపుతామని నేపాల్లోని భారతీయ రాయబార కార్యాలయ అధికారులు మంగళవారం వెల్లడించారు. నేపాల్ నుంచి వచ్చిన భారతీయులను స్వస్థలాలకు తరలించేందుకు గోరఖ్పూర్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపాలని భారతీయ రైల్వే ఆలోచిస్తుంది.