వైరల్: ఈ‌ కొండముచ్చు చాలా డిఫరెంట్ | Langur Goes To Hospital For Treatment In Karnataka | Sakshi
Sakshi News home page

వైద్యం కోసం ఆస్పత్రికి కొండముచ్చు 

Published Wed, Jun 10 2020 12:17 PM | Last Updated on Wed, Jun 10 2020 1:01 PM

Langur Goes To Hospital For Treatment In Karnataka - Sakshi

వీడియో దృశ్యం

బెంగళూరు : గాయం తగిలిన ఓ కొండముచ్చు సహాయం కోసం ఆసుపత్రి మెట్లెక్కింది. ఎంతో శ్రద్ధగా, ఓపిగ్గా ఎదురుచూసి గాయానికి వైద్యం చేయించుకుంది. ఈ సంఘటన కర్ణాటకలోని దండేలిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం ఓ కొండముచ్చుకు గాయం అవ్వటంతో అది దండేలిలోని ఓ ఆసుపత్రికి చేరుకుంది. శ్రద్ధగా ఆసుపత్రి మెట్ల దగ్గర కూర్చుని, తన వంతు వచ్చే వరకు ఓపిగ్గా వేచి చూసింది. అనంతరం వైద్యుడికి గాయం అయిన చోటుని చూపించి మనిషిలా వైద్యం చేయించుకుంది. కొండముచ్చు వైద్యం కోసం ఆసుపత్రికి రావటం అక్కడి వారిని ఆశ్చర్యపరిచింది. కొంతమంది అది వైద్యం చేయించుకునే దాకా ఎదురు చూసి, వీడియోలు సైతం తీసుకున్నారు. (ఇందులో పిల్లి ఎక్కడుందిరా బాబూ?)

శ్రద్ధగా వైద్యం చేయించుకుంటున్న కొండముచ్చు

ఓ వ్యక్తి కొండముచ్చు వీడియోను తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఉంచాడు. దీంతో అది కాస్తా వైరల్‌గా మారింది. అనంతరం ఐఎఫ్‌ఎస్‌ అధికారి సందీప్‌ త్రిపాఠీ ఆ వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ అది కోలుకుందా? చాలా క్యూట్‌గా ఉంది. అద్భుతం! మనుషుల్లో మానవత్వం ఇంకా బ్రతికే ఉందని చెప్పే దృశ్యం’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( ఎగ్జామ్‌కు ముందు 'బ్రిలియంట్' ఐడియా! )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement