కేంద్ర ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు షాక్ | Madras high court stays central government cattle notification for four weeks | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు షాక్

Published Tue, May 30 2017 5:43 PM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM

కేంద్ర ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు షాక్ - Sakshi

కేంద్ర ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు షాక్

పశువధ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌పై మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం నాలుగు వారాల స్టే విధించింది. వధించడం కోసం పశువుల అమ్మకాలు, కొనుగోళ్లను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు విడుదల చేయడం, దానిపై కేరళ, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు, పలు సంస్థలు మండిపడటం తెలిసిందే. దీనిపై ఎస్. సెల్వగోమతి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా కోర్టు స్టే విధించింది. దీనిపై నాలుగు వారాల్లోగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

ఒక మతం లేదా వర్గం ఆచారాల ప్రకారం జంతువులను చంపడం నేరం కాదని ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ (పీసీఏ) చట్టంలోని సెక్షన్ 28 చెబుతోందని మదురైకి చెందిన ప్రముఖ న్యాయవాది సెల్వగోమతి తన ప్రజాహిత వ్యాజ్యంలో పేర్కొన్నారు. దాంతో కోర్టు ఈ విషయమై తదుపరి విచారణ జరిపేందుకు వీలుగా కేంద్రప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement