మహమ్మారితో వణుకుతున్న మహారాష్ట్ర | Maharashtra Reports 2,250 New Cases | Sakshi
Sakshi News home page

అదే వరస..ఆగని కేసులు..

Published Wed, May 20 2020 9:06 PM | Last Updated on Wed, May 20 2020 9:06 PM

Maharashtra Reports 2,250 New Cases - Sakshi

ముంబై : కరోనా వైరస్‌ కేసులు మహారాష్ట్రను వణికిస్తూనే ఉన్నాయి. రోజురోజుకూ వైరస్‌ ఉధృతి పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. మహారాష్ట్రలో బుధవారం 2250 తాజా కేసులు వెలుగుచూడటంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 39,297కి పెరిగింది. ఇక కోవిడ్‌-19 హాట్‌స్పాట్‌గా మారన ముంబై మహానగరంలోనూ మహమ్మారి నియంత్రణలోకి రాలేదు. ముంబైలో 1372 కొత్త కేసులు బయటపడ్డాయి. మహమ్మారి బారినపడి నగరంలో ఒక్కరోజే 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో మొత్తం కోవిడ్‌-19 మరణాల సంఖ్య 1390కి పెరగ్గా, ముంబైలో మృతుల సంఖ్య 841కి చేరింది. ఇక ముంబైలోని అతిపెద్ద మురికివాడలో 25 తాజా కేసులు వెలుగుచూడగా ఆ ప్రాంతంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1378కి పెరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement