వర్గీకరణకు మద్దతివ్వండి | Mandha Krishna to CM Nitish Kumar about Classification of Scheduled Castes reservation | Sakshi
Sakshi News home page

వర్గీకరణకు మద్దతివ్వండి

Published Mon, Dec 19 2016 2:58 AM | Last Updated on Tue, Oct 9 2018 5:22 PM

వర్గీకరణకు మద్దతివ్వండి - Sakshi

వర్గీకరణకు మద్దతివ్వండి

బిహార్‌ సీఎంను కోరిన మంద కృష్ణ  

సాక్షి, న్యూఢిల్లీ: షెడ్యూల్‌ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతివ్వాలని బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ను మంద కృష్ణమాదిగ కోరారు. ఈ మేరకు బిహార్‌ ముఖ్యమంత్రిని ఆయన ఆదివారం పట్నాలో కలసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సుమారు గంటపాటు వర్గీకరణ అంశాలపై చర్చించారు. గత 22 ఏళ్లుగా వర్గీకరణ కోసం పోరాడుతుండటం అభినందనీయమని నితీశ్‌కుమార్‌ ప్రశంసించినట్లు మంద కృష్ణ తెలిపారు.

వెనుకబడిన దళితులకు న్యాయం చేయడానికి బిహార్‌లో మహాదళిత్‌ పాలసీని అమలు చేస్తున్నట్టు నితీశ్‌ చెప్పారన్నారు. షెడ్యూల్‌ కులాలను వర్గీకరించాలని కోరుతూ త్వరలోనే ప్రధాని మోదీకి లేఖ రాస్తానని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిపారు. వర్గీకరణకు అనుకూలంగా పార్లమెంటులో బిల్లు పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పినట్టు మంద కృష్ణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement