కోల్‌కతా : కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతుండటంతో హౌరా స్టేషన్‌లో వందమందికి పైగా వలస కార్మికులు చిక్కుకుపోయారు. గత ఐదురోజులుగా ఇక్కడే పడిగాపులు కాస్తున్న కూలీలను పట్టించుకున్న వారే లేరు. వలస కూలీల్లో కొందరు బిహార్‌కు, మరికొందరు అసోంకు వెళ్లాల్సి ఉండగా రైళ్లు, బస్‌లు సహా రవాణా సదుపాయాలు లేక హౌరా స్టేషన్‌లోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. రైల్వేలు అన్ని రైళ్లను రద్దు చేయడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వీరి వద్ద ఎలాంటి ఆహారం, డబ్బు లేక ఇంటికి తిరిగి వెళ్లే మార్గం కనిపించక విలవిలలాడుతున్నారు. హౌరా స్టేషన్‌లో చిక్కుకుపోయిన తమను కేంద్ర ప్రభుత్వంతో పాటు బెంగాల్ ప్రభుత్వం ఆదుకోవాలని వలస కూలీలు కోరుతున్నారు. మరోవైపు మహమ్మారి కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా మానవాళిని భయాందోళనకు గురిచేస్తూ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో పలు దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి.
Comments
Please login to add a commentAdd a comment