
కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ స్పందించారు. కొందరు దురుద్దేశపూర్వకంగా కట్టుకథలతో ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం వైరల్‌గా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన వారిపై న్యాయపరమైన చర్యలు చేపడతానని హెచ్చరించారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు తనపై ఆరోపణలు చేయడం వెనుక భారీ అజెండా ఉందని ఎంజే అక్బర్ ఆరోపించారు. ఎడిటర్‌గా ఉన్న సమయంలో అక్బర్ తమను వేధించాడని పలువురు మహిళా జర్నలిస్టులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఇప్పటివరకు అధికార బీజేపీ స్పందించలేదు. అయితే, విదేశీ పర్యటనలో ఉన్న అక్బర్‌ను హుటాహుటిన దేశానికి రప్పించడం వెనుక మీటూ ప్రకంపనలు ఉన్నట్టు తెలుస్తోంది