
2019 ఎన్నికల్లో మొబైలే మధ్యవర్తి
2019 ఎన్నికల నాటికి రాజకీయ నాయకులు, ఓటర్ల మధ్య మొబైల్ ఫోన్లే అతిపెద్ద మధ్యవర్తిగా ఉంటాయని ప్రధాని మోదీ అన్నారు.
న్యూఢిల్లీ: 2019 ఎన్నికల నాటికి రాజకీయ నాయకులు, ఓటర్ల మధ్య మొబైల్ ఫోన్లే అతిపెద్ద మధ్యవర్తిగా ఉంటాయని ప్రధాని మోదీ అన్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి లోక్‌సభకు ఎన్నికైన బీజేపీ ఎంపీలు, నామినేటెడ్ ఎంపీలతో ఆయన శుక్రవారం సమావేశమయ్యారు.
ప్రజలకు చేరువగా ఉండేందుకు ఎంపీలు మొబైళ్లతోపాటుఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్‌లను వాడాలన్నారు. ప్రధాని మోదీ శనివారం రాత్రి 10 గంటలకు వివిధ అంశాలపై యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దౌత్యం, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, ఆధ్యాత్మికత తదితర అంశాలపై ఆయన ప్రసంగం ఉంటుంది.