మంత్రివర్గంలోని అవినీతిపరులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గ్యాంగ్‌లీడర్‌గా మారారని సీపీఐ ధ్వజమెత్తింది.
♦ బీజేపీ మంత్రుల అవినీతిపై నోరు మెదపని మోదీ
♦ పెట్రోల్‌పై 15 రూపాయలు తగ్గించాలి
♦ ధ్వజమెత్తిన సీపీఐ జాతీయ సమితి
సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గంలోని అవినీతిపరులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గ్యాంగ్‌లీడర్‌గా మారారని సీపీఐ ధ్వజమెత్తింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, ముఖ్యమంత్రులు వసుంధర రాజే, శివరాజ్‌సింగ్ చౌహాన్, రమణ్‌సింగ్ వంటి వారు సచ్ఛీలురే అయితే విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నిం చింది. గుంటూరులో ఆదివారం ముగిసిన పార్టీ జాతీయ సమితి సమావేశాల వివరాలను సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, పార్టీ నేతలు డాక్టర్ కె.నారాయణ, పల్లా వెంకటరెడ్డితో కలసి సోమవారమిక్కడ మీడియాకు వెల్లడించారు.
జైట్లీ అవినీతి నిజమేనని చెప్పిన బీజేపీ ఎంపీ కీర్తి అజాద్‌ను సస్పెండ్ చేయడం దేనికి సంకేతమని సురవరం నిలదీశారు. మోదీ ప్రభుత్వం వచ్చిన 19 నెలల కాలంలో ఆశ్రీత పెట్టుబడిదారీ విధానం పెరిగి 53 శాతం సంపద ఒక్క శాతంగా ఉన్న పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లితే ఇదే సమయంలో 19 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. హెరిటేజ్, రిలయన్స్‌ఫ్రెష్ వంటి కార్పొరేట్ సంస్థలు ఎంతెంత సరుకును దాచిపెట్టాయో విచారణ జరి పించాలని డిమాండ్ చేశారు. పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదుల చొరబాటుకు ఎవరు బాధ్యులో విచారణ జరిపించాలన్నారు. వచ్చే ఏప్రిల్‌లో 15 రోజులపాటు పార్టీ నిర్మాణంపై దృష్టి సారించి శాఖల పటిష్టతకు చర్యలు చేపట్టాలని జాతీయ సమితి తీర్మానించినట్టు చెప్పారు. పశ్చిమ బెం గాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరీ, అస్సోం రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని సురవరం స్పష్టంచేశారు. రాయపాటి ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి అల్పాహారానికి వెళ్లామని, ఇందులో ఎటువంటి ప్రత్యేకత లేదని చెప్పారు.