న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం లోక్‌సభలో చేసిన తొలి ప్రసంగంపై విపక్ష కాంగ్రెస్ పార్టీ పెదవి విరిచింది. ఎన్నికల హామీలపై మోడీ తన ప్రసంగంలో స్పష్టత ఇవ్వలేకపోయారని విమర్శించింది. వాగ్దానాల అమలుకు మోడీ తన ప్రసంగంలో రోడ్‌మ్యాప్ ప్రకటిస్తారని ఆశించామని... కానీ ఆయన ప్రసంగం వాక్పటిమను చాటుకోవడానికే పరిమితమైందని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా విమర్శిం చారు. అయితే హామీలపై ప్రభుత్వ చిత్తశుద్ధిని మాత్రం అనుమానించట్లేదన్నారు.
ఒవైసీపై బీజేపీ ఎంపీల గరం గరం: రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గోద్రా అల్లర్లు, ఇష్రాత్ జహాన్ బూటకపు ఎన్‌కౌంటర్, బాబ్రీ మసీదు కూల్చివేతను ప్రస్తావించడంపై బీజేపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మైనారిటీలపై జరిగిన దాడులకు ఎవరు బాధ్యులో తెలుసుకోవాలనుకుంటున్నట్లు ఒవైసీ పేర్కొనగా బీజేపీ సభ్యులు ఆయన ప్రసంగానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. ఒవైసీ సిగ్గు..సిగ్గు అంటూ బిగ్గరగా అరిచారు. అయినా వెనక్కి తగ్గని ఒవైసీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. మైనారిటీల కోసం ప్రధాని మోడీ ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
మోడీ ప్రసంగంలో స్పష్టతేదీ?: కాంగ్రెస్
Published Thu, Jun 12 2014 5:41 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement