'మూడు భాషల్లో బోధన ఉండేలా చూడండి'
గువాహటి: సీబీఎస్ఈ పాఠశాలల్లో మూడు భాషల్లో విద్యను బోధించేలా చూస్తానని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇవ్వాలని ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొందరు ప్రముఖులు కోరారు. రాష్ట్ర భాషతోపాటు.. ఆంగ్లము, హిందీని తప్పనిసరిగా బోధించే నియమనిబంధనలు పకడ్బంధీగా సీబీఎస్ఈ పాఠశాలల్లో అమలు చేయాలని విన్నవించారు. ఫ్రెండ్స్ ఆఫ్ అస్సాం అండ్ సెవన్ సిస్టర్స్(ఎఫ్ఏఎస్ఎస్) అనే ఓ అంతర్జాతీయ స్థాయికి చెందిన సంస్థ ప్రధాని నరేంద్రమోదీకి ఓ లేఖ రాసింది.
ఇందులో సీబీఎస్ఈ పాఠశాలల్లో ఆంగ్ల భాషే ప్రధానంగా విద్యాబోధన జరుగుతుందని, అయితే, హిందీతోపాటు, ప్రాంతీయ మాతృభాషను విద్యార్థులు తప్పకుండా నేర్చుకోవాలనే నిబంధన చేర్చాలని అందులో కోరింది. ఇటీవల కాలంలో సంస్కృతం, జర్మనీ వంటి భాషలను కూడా చేర్చాలనే విషయంపై చర్చ జరిగిందని ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని మాతృభాషల్లో సీబీఎస్ఈ పాఠశాలల్లో బోధన జరిగేలా చూడాలని తెలిపారు.