స్వాతంత్ర్య సమరయోధుల పింఛను రూ.7వేలు! | Monthly pension for freedom fighters to be raised to Rs 7000 | Sakshi
Sakshi News home page

స్వాతంత్ర్య సమరయోధుల పింఛను రూ.7వేలు!

Published Mon, Dec 15 2014 7:58 PM | Last Updated on Sat, Sep 2 2017 6:13 PM

Monthly pension for freedom fighters to be raised to Rs 7000

స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చే పింఛనును ఇప్పుడున్న రూ.5వేల నుంచి రూ. 7వేలకు పెంచుతున్నట్లు పాండిచ్చేరి ముఖ్యమంత్రి రంగసామి తెలిపారు. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. ఈ పెరిగిన పింఛను వచ్చే సంవత్సరం జనవరి నుంచి అమలులోకి వస్తుంది.

ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, మరికొందరు కేంద్ర మంత్రులను కలిసిన రంగసామి.. ఆదివారమే పుదుచ్చేరికి తిరిగి వచ్చారు. అసెంబ్లీ భవనం కొత్త ప్రాంగణానికి శంకుస్థాపన చేసేందుకు రావాల్సిందిగా తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించానని, అందుకు ఆయన అంగీకరించారని రంగసామి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement