సెహోర్: కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన పంటల బీమా పథకంపై మధ్యప్రదేశ్‌లో ఈ నెల 18న జరగనున్న కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో షేర్‌పూర్ గ్రామంలో నిర్మించనున్న వేదిక చుట్టుపక్కల ఉన్న పంటలను కోసేయాలని ఒత్తిడి జరుగుతోందని షేర్‌పూర్ రైతులు ఆరోపిస్తున్నారు.
అయితే అలాంటిదేమీ లేదని బీజేపీ ఖండిస్తోంది. ‘మా పచ్చని గోధుమ పంటను కోసేయాల్సిందిగా ఓ అధికారి అడిగారు. ఇంకా ఆ పంట పూర్తిగా ఎదగలేదు కూడా. పంట పోతే లక్షల రూపాయలు నాకు నష్టం వాటిల్లుతుంది’ అని సురేశ్ పరమర్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.