రూ. 40 కోసం రూ. 33 వేల ఖర్చు
న్యూఢిల్లీ: కేవలం 40 రూపాయల కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.33 వేలు లాయర్ ఖర్చుల కింద ఖర్చుపెట్టిందిట! ప్రజాధనాన్ని ఎందుకు ఇంతలా వృథా చేసిందో తెలిస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోతారు. గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఎన్ని దరఖాస్తులు దాఖలయ్యాయి, వాటిల్లో ఎన్ని పరిష్కరించారో తెలపాలంటూ ఈ మధ్య నే ఆర్కే జైన్ అనే ఆర్టీఐ కార్యకర్త ఒక దరఖాస్తు ఇచ్చారు. ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ ఆదేశాలను కూడా పట్టించుకోకుండా 20 పేజీల సమాచారాన్ని ఇవ్వడానికి రూ.40 చెల్లించాలంటూ ఆర్కే జైన్‌పై సీపీఐవో చేతన్ చావ్లా ఒత్తిడి తెచ్చారు.
దీనిపై సమాచారకమిషన్‌లో తమ వాదనలు వినిపించడానికి లాయర్ ఫీజు కింద ఎన్‌జీటీ అధికారులు రూ. 33 వేలు చెల్లించారు. ఈ దుబారాపై మండిపడ్డ సమాచారకమిషనర్ మాఢభూషి శ్రీధర్‌ఆచార్యులు.. ఈ కేసులో దుబారా చేసిన అధికారి నుంచి ఆ మొత్తాన్ని తిరిగి రాబట్టాలని ఎన్జీటీ చైర్మన్‌ను ఆదేశించారు.