నైజీరియన్ డ్రగ్స్ ముఠాకు దావూద్ తో సంబంధాలు?
నైజీరియన్ డ్రగ్స్ ముఠాకు దావూద్ తో సంబంధాలు?
Published Mon, Jul 21 2014 3:58 PM | Last Updated on Wed, Oct 17 2018 5:27 PM
దేశంలో నానాటికీ పెరిగిపోతున్న నైజీరియన్ డ్రగ్స్ కార్యకలాపాల వెనుక దావూద్ ఇబ్రాహీం గ్యాంగ్ హస్తముందా? ప్రపంచవ్యాప్త ఉగ్రవాద సంస్థ అల్ కాయిదా అనుబంధ సంస్థలకు, నైజీరియన్ డ్రగ్ ముటాల కార్యకలాపాల మధ్య సంబంధాలున్నాయా?
అవుననే అంటున్నాయి ఇంటలిజెన్స్ వర్గాలు. మన దేశంలో బెంగుళూరు, హైదరాబాద్, పుణెల వంటి మహానగరాల్లో నైజీరియన్ డ్రగ్ ముఠాలు యాక్టివ్ గా ఉన్నాయి. ఇటీవలి కాలంలో చాలా మంది పట్టుబడ్డారు కూడా. అయితే వీరందరికీ అల్ కాయిదా అనుబంధ సంస్థ, నైజీరియాలో వందలాది మంది బాలికలను కిడ్నాప్ చేసిన బోకో హరామ్ కి సన్నిహిత సంబంధాలున్నాయని ఇంటలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. బోకోహరామ్ దావూద్ ఇబ్రాహీం గ్యాంగ్ తో చేతులు కలిపి పనిచేస్తోందని, డి గ్యాంగ్ నుంచే వీరికి మాదక ద్రవ్యాలు అందుతున్నాయని వారు భావిస్తున్నారు.
గత ఏడాదిలో మన దేశంలో డ్రగ్స్ వ్యాపారం చేస్తూ 40 మంది నైజీరియన్లు పట్టుబడ్డారు. వీరిలో ఒక్కరు మినహా మిగతావారెవరికీ భారత్ లో ఉండేందుకు కావలసిన పత్రాలు లేవు. దేశంలో 2500 మంది నైజీరియన్లు అక్రమంగా నివసిస్తున్నారని, వీరిలో కనీసం 1500 మంది డ్రగ్స్ వ్యాపారంతో సంబంధాలున్నాయని ఇంటలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.
మన రాష్ట్రంలోనూ నైజీరియన్లు పట్టుబడ్డ అనేక కేసులున్నాయి. వీరిలో కొందరు సినిమా రంగంలోని వ్యక్తులకు డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డారు కూడా.
Advertisement
Advertisement