పట్నా : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. వైరస్ ధాటికి సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు భయాందోళనకు గురవతున్నారు. దేశంలో ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కరోనా బారినపడ్డారు. తాజాగా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను కరోనా భయం వెంటాడుతోంది. రెండు రోజుల క్రితం ఓ కార్యక్రమంలో పాల్గొన్న నితీష్.. పలువురు నేతలతో సమావేశమైయ్యారు. అయితే వారిలో ఓ నేతకు శనివారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో సీఎంకి కూడా వైరస్ సోకి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు నితీష్ నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. ఆది, సోమవారాల్లో రిపోర్టు వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే నిర్వహించన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.(కరోనా టీకా: ఐసీఎంఆర్ కీలక ప్రకటన)
Comments
Please login to add a commentAdd a comment