
బిహార్ సీఎం నితీష్ కుమార్ (ఫైల్ ఫోటో)
పట్నా : 2019 లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులకు వరాలు గుప్పించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ), బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(బీపీఎస్‌సీ) నిర్వహించే సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష పాసైన ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు రూ. లక్ష, రూ. 50 వేలు నజరానాగా అందిస్తామని సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు ఎస్‌సీ, ఎస్‌టీ సంక్షేమ శాఖ చేసిన ప్రతిపాదనకు బిహార్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు, సౌకర్యాలు సమకూర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్ణయాన్ని వెల్లడిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంజని కుమార్ సింగ్ వెల్లడించారు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఖర్చుల గురించి ఆలోచించకుండా మెయిన్స్‌కు ప్రిపేర్ అయ్యేలా ఎస్‌సీ,ఎస్‌టీ విద్యార్థులను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment